లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు.. అరెస్టుకు రంగం సిద్ధం..?
ఈ సందర్భంగా యూసుఫ్ పఠాన్ మాట్లాడుతూ.. తనకు ఇక్కడ పెద్ద టీమ్ ఉందని, ఇది (రాజకీయాలు) తనకు భిన్నమైన పిచ్ అని, ఇక్కడ కూడా వేగంగా పరుగులు సాధించి… గెలిపించాలన్నదే తమ జట్టు లక్ష్యమని పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటు అడుగుతామని పఠాన్ చెప్పారు.
Read Also: YSRCP: ‘నిజం గెలవాలి’ కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు
అంతేకాకుండా.. 2007 ప్రపంచ కప్‌లో తాను ఆడినట్లు చెప్పాడు. ఆ సమయంలో కప్ సాధించి ఎంతో సంతోషపడ్డానో… ఇప్పుడు కూడా అదే సంతోషం… అదే ఉత్సాహంతో ఉన్నానని పఠాన్ తెలిపారు. కాగా.. గుజరాత్ జన్మభూమి అయితే… బెంగాల్ కర్మభూమి అని అన్నారు. ఇకపోతే.. బెర్‌హమ్‌పోర్ కాంగ్రెస్ కు కంచుకోట అని చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి గతంలో ఐదుసార్లు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా గెలిచారు. అయితే.. ఇప్పుడు టీఎంసీ నుంచి పఠాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
