Site icon NTV Telugu

YS Jagan: ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..

Ys Jagan Press Conference

Ys Jagan Press Conference

ఏపీలో విద్యా వ్యవస్థపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు.. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని విమర్శించారు. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదన్నారు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని.. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయలేదని.. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమన్నారు. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు అని ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు..

READ MORE: Bengaluru: చెత్త లారీలో మహిళ మృతదేహం..

Exit mobile version