Site icon NTV Telugu

KCR: జూన్ 5న బిగ్‌ డే.. కాళేశ్వరం కమిషన్‌ ముందుకు కేసీఆర్‌

Kcr

Kcr

కాళేశ్వరం కమిషన్‌ ముందుకు మాజీ సీఎం కేసీఆర్‌ జూన్‌ 5న విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్‌ కమిషన్ హాజరు సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచి రేపు కేటీఆర్‌ హైదరాబాద్‌కు రానున్నారు. జూన్‌ 5న ఫోన్‌ ట్యాపింగ్ కేసులో సిట్‌ ముందు ప్రభాకర్‌ రావు హాజరుకానున్నారు. ఇదే రోజు తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదకపై నిర్మాణ సంస్థపై చర్యకు ఆమోదం తెలుపనుంది కేబినెట్‌. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Also Read:Shashi Tharoor: కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన శశిథరూర్.. ఏమన్నారంటే..!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై విచారణకు కమిషన్ వేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది.

Exit mobile version