బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది. రైతుల కొరకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని నిర్ణయించారు.
READ MORE: Honeymoon Murder: రాజా రఘువంశీ హత్యలో మరో ట్విస్ట్.. కొత్త వ్యక్తికి 119 సార్లు కాల్ చేసిన సోనమ్..
కాగా.. జూన్ 15న మాజీ మంత్రి హరీష్‌రావు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అలాంటి వేళ.. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం లేఖ రాశారు. గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కారణంగా గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఏంసీల గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలించేందుకు మూడు దశల్లో ప్రాజెక్ట్ డిజైన్, కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం.. తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమేనని ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఆ లేఖలో స్పష్టం చేశారు.
READ MORE: Joe Root: ‘బజ్‌బాల్’ సరికాదేమో.. ఇండియా సిరీస్‌కు ముందు జో రూట్ కీలక వ్యాఖ్యలు..!
