NTV Telugu Site icon

KCR: తెలంగాణ విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్..

Kcr

Kcr

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని..జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ల పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ కమిషన్, జస్టిస్ నర్సింహారెడ్డి, ఎనర్జీ విభాగం అధికాలను ప్రతివాదులుగా చేర్చారు.

READ MORE: Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి, పొంగులేటి..

గతంలో ఈ కమిషన్ పై కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ కమిషన్ చేపడుతున్న విచారణ నిష్పక్షపాతంగా లేదన్నారు. ఈ మేరకు విద్యుత్ విచారణ కమిషన్‌కు 12పేజీల లేఖ(12Pages Letter)ను కేసీఆర్ ను సైతం పంపించారు. చట్ట విరుద్ధంగా విచారణ ప్రారంభించారంటూ నరసింహారెడ్డిపై లేఖలో మండిపడ్డారు. “విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89శాతం ఏపీకి 46.11శాతం విద్యుత్ కేటాయించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏ మాత్రం సరిపోదు. తెలంగాణ వచ్చే నాటికి 5వేల మెగావాట్ల కొరతతో రాష్ట్ర విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. పంపిణీ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర విభజన నాటికి 7,778మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలతో 20వేల మెగావాట్లకు పైగా తీసుకెళ్లాం. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి అభ్యంతరాలు చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేసింది. ఈఆర్సీ నిర్ణయాలపై రేవంత్ రెడ్డికి అభ్యంతరాలు ఉంటే ఆనాడే ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టును ఆశ్రయించే వారు.. కానీ ఎలాంటి అప్పీల్‌కు వెళ్లలేదు” అని అన్నారు.