మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ నర్సింహరెడ్డిని అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు.