NTV Telugu Site icon

KCR: ఆ కేసు కొట్టివేయాలి.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్‌

Kcr

Kcr

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011లో రైల్‌రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు. రైల్‌ రోకో కేసులో తనను 15వ నిందితుడుగా చేర్చారని.. తాను రైల్‌రోకోలో పాల్గొనలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు మాజీ సీఎం కేసీఆర్‌. కేసీఆర్ పిటిషన్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. 2011 అక్టోబర్‌లో రైల్‌రోకోకు కేసీఆర్‌ పిలుపునిచ్చారని మల్కాజ్‌గిరి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. పలు రైళ్ల రాకపోకలకు, ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించి కేసీఆర్ ఎలాంటి రైల్‌రోకోలో పాల్గొనలేదని తాజా పిటిషన్‌లో తెలిపారు.

Read Also: Kishan Reddy: ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం