NTV Telugu Site icon

Former CM Jagan: “ఇది అత్యంత విచారకరం”.. తొక్కిసలాట ఘటనపై మాజీ సీఎం జగన్ రియాక్షన్..

Ys Jagan

Ys Jagan

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మరో 48 మంది క్షతగాత్రులు తిరుపతిలోని రుయా, స్విమ్స్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా రుయా ఆస్పత్రి నుంచి 8 మందిని స్విమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం స్విమ్స్‌ ఆస్పత్రిలో 16 మంది భక్తులకు చికిత్స అందిస్తున్నారు. 32 మంది భక్తులు డిశ్చార్జ్‌ అయ్యారు. ఇదిలా ఉండగా… ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

READ MORE: Bhumana Karunakar: అందుకే తొక్కసలాట జరిగింది.. టీటీడీ మాజీ ఛైర్మన్ తీవ్ర వ్యాఖ్యలు..

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌. జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

READ MORE:Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

Show comments