NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు!

Wgl Students Rape

Wgl Students Rape

హైదరాబాద్‌లో మరో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఓ విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నిందితుడు క్యాబ్ డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. సెలవుల కోసం ఇండియాకు వచ్చిన ఈ విదేశీ యువతి షాపింగ్ చేసేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. మీర్‌పేట్ పరిధిలోని ఫ్రెండ్ ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్న ఆమె, తన ఫ్రెండ్ అయిన మరో విదేశీ యువకుడు, పిల్లలతో కలిసి షాపింగ్ కోసం బయలుదేరింది. క్యాబ్‌లో గంటన్నర పాటు తిరిగిన తర్వాత, పహాడీ షరీఫ్ ప్రాంతానికి చేరుకోగానే క్యాబ్ డ్రైవర్ ఆ యువకుడిని, పిల్లలను కిందికి దించేశాడు. అయితే, యువతిని మాత్రం కారులో ముందుకు తీసుకెళ్లాడు.

READ MORE: Zelenskyy: ఆస్తులు ప్రకటించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఎంత పెరిగిందంటే..!

కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత, నిర్మానుష్య ప్రదేశంలో ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి ఆమెను తీసుకువచ్చి, ఆమె స్నేహితుడి వద్ద వదిలేసి పరారయ్యాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ, డ్రైవర్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటన నగరంలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.

READ MORE: Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి.. జైలుకు తరలింపు!