Instagram: ఇన్‌స్టాలోనూ ‘బ్రాడ్‌కాస్ట్ చానెల్స్’.. వారికి పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెటా సంస్థకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ బిలియన్ ప్లస్ డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఇన్‌స్టా తమ కస్టమర్లను అలరించేందుకు వారికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందిస్తూ ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం ఫోటోలు అప్‌లోడ్ చేయడం మాత్రమే కాదు.. కంటెంట్ క్రియేటర్లుగా కూడా మారొచ్చు. అంతేకాకుండా క్రియేటర్లుగా మారిన వాళ్లు ఇన్‌స్టా రీల్స్‌తో డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికోసం తాజాగా ఇన్‌స్టా ఒక మేజర్ ఫీచర్ తీసుకొచ్చింది.
Also Read: IPL 2023: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది
Also Read
ఇన్‌స్టా క్రియేటర్ల కోసం బ్రాడ్‌కాస్టింగ్ చానెల్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌లో క్రియేటర్లు కొన్ని చానెల్స్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. వాటి ద్వారా క్రియేటర్లు వారి అభిమానులు, ఫాలోవర్స్‌తో కాంటాక్ట్ అయ్యేందుకు, వారితో సమాచారం పంచుకునేందుకు వీలుంటుంది. దీనిలో టెక్ట్స్, వీడియో, ఫోటోలు, వాయిస్ నోట్స్ ద్వారా కూడా ముచ్చటించవచ్చు. ఫ్యా్నస్ కూడా వారి అభిప్రాయాలను పంచుకోవచ్చు. చానెల్స్ అంటే ఒక రకంగా పబ్లిక్ చాట్ అని చెప్పవచ్చు. అందులో మీ అభిప్రాయాలను కూడా పంచుకునే వీలుంటుంది.
📣 Get updates from your fave creators with broadcast channels 💬
We’re testing a way for creators to invite followers to join their public chat for announcements and updates, where you can read and react to messages and vote in polls 🙌 pic.twitter.com/mP5XfGFdoE
— Instagram (@instagram) February 16, 2023
ఈ చానెల్స్ గురించి సింపుల్‌గా చెప్పాలి అంటే.. టెలిగ్రామ్‌లో ఎలా అయితే పబ్లిక్ గ్రూప్స్ ఉంటాయో.. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో చానెల్స్ పేరిట పబ్లిక్ చాట్ ఉంటుంది. టెలిగ్రామ్ తరహాలోనే క్రియేటర్లు చేసే ఈ చానెల్స్‌లో మీరు కూడా జాయిన్ కావచ్చు. అందరు అందులో సమాచారాన్ని పంచుకోవచ్చు. మీకు నచ్చిన మెసేజ్‌కి మాత్రమే మీరు రెస్పాండ్ కావచ్చు. కాకపోతే ఇందులో రిప్లే ఇచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది జుకరబర్గ్ సహా అమెరికాలో ఉన్న కొందరు క్రియేటర్లకు మాత్రమే టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించారు. త్వరలోనే అందరు క్రియేటర్ల కోసం అందుబాటులోకి తీసుకొస్తారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?