Union Budget 2023: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే చిన్నది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును నిర్దేశించే ఈ కేంద్ర పద్దును ఆమె ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. దీంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు సీతారామన్. ఇదే కాదు.. గత నాలుగేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతూ వస్తోన్న నిర్మలమ్మ .. పద్దు విషయంలో పలు కొత్త సంప్రదాయాలకు తెరతీశారు. సీతారామన్ ఇప్పటి వరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. ఈసారి ఆమె దేశ పద్దును 87 నిమిషాల్లో (1 గంట 27 నిమిషాలు) పార్లమెంటు వేదికగా ప్రజల ముందుంచారు.
Union Budget 2023: వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20 లక్షల కోట్ల రుణాలు
Also Read
- Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
నిర్మలమ్మదే రికార్డు..
ఇకపోతే, ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 (2 గంటల 42 నిమిషాలు) నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే కాస్త అస్వస్థతతో ఉండటంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు.
Nirmala Sitaraman: నిర్మలమ్మ చమ్మక్కులు.. నవ్వుకున్న సభ్యులు
ఐదోసారి ప్రవేశపెట్టి..
2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. తద్వారా పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన సీతారామన్.. ఎక్కువసార్లు పద్దును ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన రికార్డు తన పేరిట లిఖించారు.
Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
అతి తక్కువ పదాల బడ్జెట్ ఏంటంటే!
1991లో పీవీ నరసింహారావు గవర్నమెంట్‌లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి.
DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చరిత్ర తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరణ..
-
Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
-
Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!