Nirmala Sitaraman: నిర్మలమ్మ చమ్మక్కులు.. నవ్వుకున్న సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitaraman: ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్ 2023-24ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు. దీంతో లోక్‌సభలో నవ్వులు పూశాయి. వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ గురించి ఆమె ప్రకటన చేస్తూ .. పాత కలుషిత వాహనాలను రిప్లేస్ చేస్తున్నామని చెప్పే సమయంలో ఓల్డ్ పొల్యూటింగ్ కు బదులుగా .. ఓల్డ్ పొలిటికల్ అని పలికారు. ఆ తర్వాత వెంటనే సారీ చెబుతూ.. ఓల్డ్ పొల్యూటింగ్ వెహికిల్స్ అన్నారు. అయితే పొల్యూటింగ్ పదం స్థానంలో పొలిటికల్ అని మంత్రి పలకడంతో సభ్యులు నవ్వేశారు. వెహికిల్ రిప్లేస్‌మెంట్ పాలసీ అతిముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికిన ఆమె తన పొరపాటును గుర్తించి చిరునవ్వు నవ్వారు. ఇక పొలిటికల్ పదం వాడిన సందర్భంలో పలుమార్లు పొల్యూటింగ్ పదాన్ని వినిపించారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని చేపడుతున్నట్లు ఆమె చెప్పారు.
MPs laugh as FM Nirmala Sitharaman slips up, says ‘political’ instead of ‘polluting’. #Budget2023 #BudgetWithEJ
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
Read: https://t.co/Bp1CoWd5xA pic.twitter.com/m2YwwFpg4O
— editorji (@editorji) February 1, 2023
ఇప్పటికే సీఎంలకు లేఖలు :
15 ఏళ్లకు పైగా రోడ్లపై తిరుగుతున్న అన్ని రకాల వాహనాలను నిషేధిస్తూ కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏప్రిల్ 1 నుంచి ఈ వాహనాలన్నీ కనుమరుగు కానున్నాయి. రాష్ట్ర కార్పొరేషన్లు, రవాణా శాఖ బస్సులు, ఆర్టీసీ, ఇతర వాహనాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. పర్యావరణానికి హాని కలిగిస్తున్న కారణంగా పాత వాహనాలను తక్కుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన పాలసీకి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అన్ని రాష్ట్రాలు పాటించడంతో పాటు ప్రతీ రాష్ట్ర్రంలోనూ వెహికిల్ స్క్రాపేజి పాలసీని రూపొందించి అమలు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!