Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- తప్పిన ఫ్లైదుబాయ్ విమాన ప్రమాదం
- మహిళలతో కరచాలనానికి కో-పైలట్ నిరాకరణ
- వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానానికి ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే దాదాపు 200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇంతటి ఘోర ప్రమాదాన్ని భారతీయ సంతతికి చెందిన పైలట్ స్మిత్ మచ్చర్ కాపాడాడు. కో-పైలట్ కత్తితో దాడి చేస్తున్నప్పటికీ.. వీరోచితంగా పోరాడి ప్రమాదాన్ని తప్పించాడు. దుబాయ్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు స్మిత్ మచ్చర్‌ను ప్రపంచమంతా ప్రశంసలతో అభినందిస్తున్నారు. ‘‘రియల్ హీరో’’గా అభివర్ణిస్తున్నారు. ప్రధాని మోడీ దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే తాజాగా ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు అతడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది. ఉగ్ర కోణం ఏమైనా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక ఒమన్ దేశంతో ఇజ్రాయెల్‌కు దౌత్యం సంబంధం లేదు. ఈ నేపథ్యంలో ఒమన్ దేశస్థుడిని ఇజ్రాయెల్‌కు ఎందుకు పంపించారు అన్నదానిపై కూడా ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
అంతేకాకుండా కో-పైలట్ మత ఛాందసవాదం కలిగిన వాడిగా తెలుస్తోంది. ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడని.. సహచర ఉద్యోగులు చెప్పారు. అతడు 8 నెలల క్రితమే ఉద్యోగంలో చేరాడని.. ఎప్పుడూ మతభక్తితోనే ఉండేవాడని తెలిపారు. మహిళలతో కరచాలనం చేయడానికి ఇష్టపడేవాడు కాదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన మీడియా సంస్థలతో ఓ పైలట్ వెల్లడించాడు. కొన్ని మీడియా కథనాలు అయితే.. కో-పైలట్‌ను ‘‘మత తీవ్రవాది’’గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే ఘటన వెనుక ఉగ్ర కోణం ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఫ్లైదుబాయ్ యూఏఈకి చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థ. ఇందులో వివిధ దేశాలకు చెందిన సిబ్బంది పనిచేస్తుంటారు. ఈ నేపథ్యంలో యూఏఈలోని ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగిగా ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్‌తో ఒమన్‌కు దౌత్య సంబంధం లేదు. ఈ నేపథ్యంలో ఒమన్ జాతీయుడైన కో-పైలట్‌ను ఇజ్రాయెల్‌కు విమానం నడిపేందుకు అవసరమైన అన్ని నిబంధనలను పూర్తి చేశాడా లేదా అనే విషయాలను ఇజ్రాయెల్ అధికారులు పరిశీలిస్తున్నారు. అతడి దగ్గర మరో దేశ పాస్‌పోర్ట్ ఉండొచ్చనే ఊహాగానాలు కూడా కొన్ని నివేదికల్లో వచ్చాయి. అయితే అతడికి ద్వంద్వ పౌరసత్వం లేదా మరో పాస్‌పోర్ట్ ఉందని అధికారికంగా ధృవీకరణ కాలేదు. అలాగే ఫ్లైదుబాయ్ సిబ్బంది ఎంపిక లేదా క్లియరెన్స్ విధానంలో ఏదైనా సమస్య జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ రెండు అంశాల్లో ఏదీ ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. ఈ ఘటన తర్వాత ఇజ్రాయెల్‌కు వచ్చే విమానాల పైలట్లపై భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు. రాయిటర్స్ ప్రకారం.. ఇజ్రాయెల్‌కు వచ్చే పైలట్లపై సెక్యూరిటీ వెట్టింగ్‌ను పెంచే చర్యలు చేపట్టనున్నారు.
కాక్‌పిట్‌లో అసలేం జరిగింది?
ఇజ్రాయెల్ అధికారులు, ప్రయాణికుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం.. కో-పైలట్.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విమానం కంట్రోల్స్‌లో జోక్యం చేసుకునేందుకు కూడా అతడు ప్రయత్నించినట్లు సమాచారం. ఆ సమయంలో విమానం సుమారు 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. ఘటన అనంతరం ఫ్లైట్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో విమానం 14,000 అడుగులకు పైగా ఎత్తు కోల్పోయింది. విమానం నుంచి అత్యవసర సంకేతాలు కూడా వచ్చాయి. అందులో 7500 కోడ్ కూడా ఉంది. విమానయానంలో ఈ కోడ్‌ను సాధారణంగా అక్రమ జోక్యం లేదా హైజాక్ పరిస్థితులను సూచించేందుకు ఉపయోగిస్తారు. కెప్టెన్ మచ్ఛర్ దాడిని ఎదుర్కొని కాక్‌పిట్ డోర్‌పై తిరిగి నియంత్రణ సాధించినట్లు సమాచారం. అనంతరం సిబ్బంది, ప్రయాణికులు కలిసి కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే విమానంలో ప్రయాణికులుగా మరో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు కూడా సమాచారం. వారు పరిస్థితిని అదుపులోకి తీసుకున్న అనంతరం విమానాన్ని నిర్వహించడంలో సహకరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?