Site icon NTV Telugu

Air India Flight: తప్పిన పెనుప్రమాదం.. గాలిలో ఉండగా విమానం ఇంజిన్‌లో మంటలు

Air India

Air India

Air India Flight: అబుదాబి నుంచి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజన్‌లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. తిరిగి విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

విమానం టేకాఫ్ అయినప్పుడు అందులో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా మంటలు చెలరేగాయని, పైలట్‌ వెంటనే గుర్తించి అబుదాబీ ఎయిర్‌పోర్టుకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బీ737-800 విమానం మధ్యలో మంటలు చెలరేగడంతో అబుదాబి విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని డీజీసీఏ తెలిపింది.

Free Flight Tickets: విమాన టిక్కెట్లు ఫ్రీగా ఇస్తాం.. మా దేశం వచ్చిపోండి 

జనవరి 23న త్రివేండ్రం నుంచి మస్కట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 45 నిమిషాల తర్వాత తిరిగి ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 2022లో దుబాయ్‌కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో పాము కనిపించింది.కాలికట్ నుండి దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ B-737 విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరింది. దుబాయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత, సిబ్బంది విమానంలో పాము ఉన్నట్లు నివేదించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశించింది.

Exit mobile version