Site icon NTV Telugu

Physical Harassment: భర్తను తీవ్రంగా కొట్టి.. భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

Physical Harassment

Physical Harassment

Physical Harassment: ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని సీనియర్ పోలీసు అధికారి మంగళవారం తెలిపారు. అక్టోబర్ 21 సాయంత్రం జిల్లాలోని బరునా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ జంట జాజ్‌పూర్ జిల్లాకు చెందిన వారన, ఆ మహిళ తన చదువు కోసం భుబన్‌లో ఉంటోందని అధికారి తెలిపారు.

Also Read: ISRO Chief : గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగాములు, సైంటిస్టులకు ప్రాధాన్యం

అసలేం జరిగిందంటే(పోలీసుల ప్రకారం).. శనివారం సాయంత్రం దంపతులు భువన నుంచి తమ ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్నారు. బరునా ప్రాంతంలోని కాలువ సమీపంలో కొందరు నేరస్థులు వారిని అడ్డగించి, ఆ వ్యక్తిని కొట్టి అతని మొబైల్ ఫోన్ లాక్కున్నారు. వారు తన భార్యను సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని ఆ వ్యక్తి ఆరోపించారు. బాధితురాలు భువన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: Alaska Airlines: ఆకాశంలో ఆగమాగం.. గాల్లో ఉన్న విమానం ఇంజన్ ఆపేందుకు ప్రయత్నించిన పైలెట్ అరెస్ట్

“మహిళ ఫిర్యాదు ఆధారంగా, కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు పురోగతిలో ఉంది. ఘటనలో ప్రమేయం ఉన్న నిందితులను మేము గుర్తించాము. మేము వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాము. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి గాలింపు ప్రారంభించాము.” అని ధెంకనల్ ఎస్పీ జ్ఞాన్ రంజన్ మోహపాత్ర తెలిపారు. నేరానికి ఉపయోగించిన వాహనాలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. “దర్యాప్తు చాలా ప్రాథమిక దశలో ఉంది. బాధితురాలి వైద్య పరీక్షల నివేదిక మాకు ఇంకా రాలేదు. అయితే, ఇది నిజమైన సంఘటన అని తెలుస్తోంది. మేము దర్యాప్తును వేగవంతం చేస్తున్నాము. మేము నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటాం. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.” అని ఎస్పీ తెలిపారు.

Exit mobile version