Students Missing: కృష్ణానదిలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Missing in Krishna River: విజయవాడకు సమీపంలోని యనమలకుదురు వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టడానికి వచ్చి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న ఇద్దరివి దొరకగా.. మిగతా ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు నేడు వెలికితీశాయి. ఆ మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పటమట ప్రాంతంలోని దర్శిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన షేక్ బాజీ (15), షేక్ హుస్సేన్ (15), తోట కామేష్ (15), మద్దాల బాలు (17), ఇనకొల్లు గుణశేఖర్ (14), పిన్నింటి శ్రీను, షేక్ ఖాశిం అలీలు ఏడుగురు స్నేహితులు కాగా.. శుక్రవారం సరదాగా కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లారు.
Thatikonda Rajaiah : నియోజకవర్గంలో ఎవరు పనులు చేసినా నా ఖాతాలోకే
Also Read
- MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
వీరిలో శ్రీను ఒడ్డునే ఉండిపోయాడు. నీరు ఎక్కువగా ఉన్న చోట ఈత కొడదామని షేక్ బాజీ చెప్పడంతో అందరూ చేతులు పట్టుకొని లోపలకు వెళ్లారు. పదడుగులు వేయగానే ఒక్కసారిగా లోతుగా ఉన్న గుంతల్లోకి జారిపోయారు. నీటి ఉరవడి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న శ్రీను భయాందోళనలతో పెద్దగా కేకలు వేయగా స్థానిక మత్స్యకారుడు ఏడుకొండలు అక్కడకు చేరుకుని.. ఖాసింవలిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మిగిలిన ఐదుగురు చిన్నారులు నీట మునిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న పెనమలూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, రెస్కూ సిబ్బంది సాయంతో శివలింగాల గట్టు ప్రాంతంలో గాలించారు. నిన్న రెండు మృతదేహాలు వెలికి తీయగా, ఈరోజు మిగిలిన ముగ్గురు విగత జీవులయ్యారు. దాంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. చనిపోయిన బిడ్డలను చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు.
తాజావార్తలు
-
MK Stalin: ‘అహంకారం.. వినాశనానికే’.. విజయ్ ప్రభుత్వంపై ఎంకే. స్టాలిన్ ఆగ్రహం
-
FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!