NTV Telugu Site icon

Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి

Crime News

Crime News

Crime: విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉయ్యాలలో ఉన్న పాపపై దుర్మార్గుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాడికి ఏ లాయర్ బెయిల్ కోసం వెళ్లకూడదన్నారు. ఏ ఆడపిల్లకు ఇలా జరగకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాప పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, స్తీ శిశు సంక్షేమ శాఖ నుండి అండగా ఉంటామన్నారు.

Read Also: Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి.. కర్రతో కొట్టి మరిగే నూనె పోశారు..

విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో 5 నెలల పసికందుపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో బాడంగి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ప్రాథమిక చికిత్స అందించి వైద్యులు విజయనగరంలోని ఘోషాసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి తల్లి ఇంటి నుంచి బయటకు సరుకులు తెచ్చేందుకు వెళ్లడంతో ఊయలలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లి వరుసకు తాతయ్య అయ్యే ఎరకయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న పసికందుపై అత్యాచారం చేస్తుండగా పసికందు అక్క చూసి తల్లికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఉయ్యాల దగ్గరకు వచ్చి తల్లి చూడగా.. రక్తస్రావం కావడంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఘటన అమానుషమని.. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు హేయమన్నారు మంత్రి కొండపల్లి. నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పాప కండిషన్ నిలకడగా ఉందని.. డాక్టర్ల పర్యవేక్షణలో పాపకు వైద్యం అందుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఇలాంటి ఘటనల పై జరగకుండా నిర్ణయాలు ఉంటాయి.