NTV Telugu Site icon

Nayantara : 50సెకన్లకు రూ.5కోట్లు.. నయనతార బాగా కాస్ట్లీ గురు !

New Project (43)

New Project (43)

Nayantara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నయనతార.. విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ తాను ఒక సినిమా కోసం కనీసం నాలుగు ఐదు నెలలు ఆమె కష్టపడితే ఆమెకు రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే కేవలం 50 సెకన్ల యాడ్ లో ఆమె నటించినందుకు ఐదు కోట్లు పారితోషికం తీసుకుని ఆమె టాపిక్ ఆఫ్ ది ఫిలిమ్ ఇండస్ట్రీగా మారిపోయింది.

Read Also:Tirupati Laddu Controversy: సిట్‌ దర్యాప్తునకు బ్రేక్.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..

షారూఖ్ ఖాన్ తో నటించిన ‘జవాన్’ మూవీ సూపర్ హిట్ అయిన తరువాత నయనతార రెమ్యునరేషన్ భారీగా పెంచి రూ.10కోట్ల మేర తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ నుండి కూడ ఈమెకు అవకాశాలు బాగా వస్తున్నాయి. గతంలో హీరోయిన్స్ కు సినిమాలలో నటించినప్పుడు మాత్రమే పారితోషికం భారీ స్థాయిలో వస్తూ ఉండేది. అయితే ఇప్పుడు హీరోయిన్లు.. హీరోలతో సినిమాలలో నటించడం వల్ల వచ్చే పారితోషికంతో పాటు యాడ్స్ లో నటించడం వల్ల ఇన్ స్టా గ్రామ్ ట్విట్టర్ లో పోస్టింగ్స్ పెట్టడం వల్ల కూడ భారీ పారితోషికాలు అందుకుంటున్నారు.

Read Also:Amazon Smart TV Offers: 56 శాతం డిస్కౌంట్‌.. 12 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్‌ టీవీ!

ఒక సినిమాలో నటించినందుకు దక్షిణాది సినిమా రంగంలోనే భారీ పారితోషికం తీసుకునే నయనతార.. తను నటించే సినిమాల ప్రమోషన్ విషయంలో ఏమాత్రం పట్టించుకోదు. కనీసం ఆమె నటించిన మూవీ ఫంక్షన్స్ కు కూడ ఆమె రాదు. అయినప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె తమ సినిమాలకు సంబంధించి డేట్స్ ఇస్తే చాలనుకుంటారు. నయనతార ను ఆదర్శకంగా తీసుకుని చాలామంది హీరోయిన్లు సినిమాలలో నటించే విషయం కంటే యాడ్లలో చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య నయన్ కు ఆమె భర్త విఘ్నేష్ శివన్ కు విభేదాలు వచ్చాయి అంటూ కోలీవుడ్ మీడియాలో గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే దానికి చెక్ పెడుతూ ఆమె ప్రస్తుతం తన భర్త ఆమె కవల పిల్లలతో కలిసి గ్రీస్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఈ మలయాళీ బ్యూటీ కెరీర్ స్టార్టింగులో పలు అవమానాలను, ఆవేదనలు, కష్టాలను చవి చూసినా ఆ తర్వాత మాత్రం చాలా వేగంగా స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు.

Show comments