Site icon NTV Telugu

ENG vs IND: ఒక్క టెస్టులో 5 సెంచరీలు.. కానీ ఏం లాభం..?

Eng Vs Ind

Eng Vs Ind

ENG vs IND: భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్‌ లోని హెడింగ్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 5 వికెట్లతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ చివరి, ఐదవ రోజు మంగళవారం నాడు ఇంగ్లాండ్ జట్టుకు విజయంకోసం 350 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 149, జాక్ క్రౌలీ 65, బెన్ స్టోక్స్ 33 పరుగులు చేసి విజయానికి బాటలు వేశారు. ఇక భారత్ తరపున శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

Read Also:Off The Record: సింగరేణిలో కేసీఆర్ కుటుంబ విబేధాల ఎఫెక్ట్..? కవిత టూర్‌తో కేటీఆర్‌ అలర్ట్‌ అయ్యారా?

నిజానికి భారత్ ఇంగ్లాండ్ కు భారీ లక్షాన్నే పెట్టింది. కానీ భారత్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో తేలిపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. భారత్ ఇంగ్లాండ్ జట్టుకు 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లాండ్ దానిని చేధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. ఇంగ్లాండ్ 465 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనితో భారత్ కు 6 పరుగుల లీడ్ లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో భారత్ 364 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెన్ డకెట్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది.

Read Also:Today Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభాలే!

ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు నుంచి 5 సెంచరీలు వచ్చినా మ్యాచ్ మాత్రం గెలవలేక పోయారు. మ్యాచ్ గెలవలేక పోవడానికి ప్రధాన కారణం 9 క్యాచ్‌ లను వదిలిపెట్టడం. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌ లు, రెండో ఇన్నింగ్స్‌లో 3 క్యాచ్‌ లను విడిచిపెట్టడంతో ఇంగ్లాండ్ కు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ టీమిండియాపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడింది. ఇక ఈ రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై 2 నుండి బర్మింగ్‌ హామ్‌ లో జరగనుంది.

Exit mobile version