Site icon NTV Telugu

Fish Prasadam: హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

Fish Prasadam

Fish Prasadam

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చేప ప్రసాదం పంపిణీ పై ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ కు పలు సూచనలు చేశారు.. చేప ప్రసాదం కోసం ఫిషరీస్ కార్పొరేషన్ 1.5 లక్షల చేప పిల్లలు సిద్ధం చేసింది.

READ MORE: Vaibhav Suryavanshi: అరెరే పెద్ద సమస్యే వచ్చిందే.. కారు గెలిచాడు కానీ.. మరో నాలుగేళ్లు..?

చేప ప్రసాదం పంపిణీలో భారీకెడ్లు, క్యూ లైన్ లో ఇబ్బందులు, భద్రత ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి తాగునీరు ఏర్పాటు చేయాలని, వారికి భోజన వసతి కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు కావలసిన ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ నెల 6 వ తేదీ నుంచే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

READ MORE: TGTET 2025 : టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఈ నెల 18 నుండి టెట్ పరీక్షలు..

Exit mobile version