శ్రావణ మాసం అన్నింటిలో కెల్లా ఎంతో పవిత్రమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజు పవిత్రమైనదే. ప్రతి వారం మంచిదే. ప్రతి తిథి ప్రముఖమైనదే. ఈనెలలో చాలా వ్రతాలు ఉంటాయి. వాటిలో వరలక్ష్మి వత్రం, మంగళగౌరి వ్రతం, శ్రావణ మాస వ్రతం, నారసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం ఇలా చాలా వ్రతాలు వస్తాయి. ఇలా ఈ నెల మొత్తం వత్రాలు, పూజలు అంటూ దేవుడి ప్రార్థన లోనే సరిపోతుంది. ఇక ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉండబట్టే ఈ నెలలోనే ఎక్కువగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలను జరుపుకుంటారు. ఇక ఈ మాసం పరమ శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. ఈ నెలకు ఉండే ప్రాధాన్యత ఏంటంటే శ్రావణమాసంలో పరవ శివుడిని పూజించి రుద్రాభిషేకం చేస్తే మహా విష్ణువు కూడా ఆనందిస్తాడట. శివుని అభిషేకంతో పాటు విష్ణు పురాణాన్ని చదివినా, విన్నా ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.
ఇక శ్రావణమాస మహాత్మ్యాన్ని 24 అధ్యాయాలలో సనత్కుమార మహర్షి కోరిక మేరకు పరమ శివుడు వివరించాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ మాసంలో శివుడికి రుద్రాభిషేకం కుదరకపోతే నీటితో అభిషేకం చేసినా తలచిన కార్యాలు నెరవేరుతాయి. అంతేకాకుండా పరమ పవిత్రమైనదిగా భావించే ఈ మాసంలో తోచినంతగా, మన స్థాయికి తగ్గట్టు దానధర్మాలు చేస్తే మంచిది.ఇక శ్రావణమాసంలో వచ్చే ఆదివారానికి ఎంతో విశిష్టత ఉంది. ఆదివారం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. సూర్య భగవానుడు జన్మించిన రోజు ఆదివారం. ఈరోజుకు మన సనాతన ధర్మంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా సౌరమానం ప్రకారం సూర్యుని గమనాన్ని ఆధారంగా చేసుకొనే నిర్ణయిస్తారు. ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటివి చేసే ఆచారం మన భారతీయ సంప్రదాయంలో అనాదిగా ఉంది. సూర్యుడిని ప్రార్థించడం ద్వారా ఆరోగ్యం కూడా కలుగుతుంది.
Also Read: Gold Today Price: మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఇక సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన ఆదివారం నాడు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీతో సాంగత్యం చేయడం, క్షవరం చేసుకోవటం చేయడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ రోజున తలకు నూనె పెట్టుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు. అయితే ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా సండే అంటే ఫన్ డే గా మారిపోయింది. ఇక ఆరోజు అందరికి సెలవు కావడంతో రెస్ట్ తీసుకొని రిలాక్స్ కావడానికి దీనిని మంచి రోజుగా భావించి మధ్యాహ్నం 12 గంటల వరకు చాలా మంది నిద్రపోతున్నారు. ఇక చాలా మంది తమ ఇంట్లో చికెన్, మటన్ వండుకుంటున్నారు. ఖాళీ దొరికిందని నూనె పెట్టి తలస్నానం చేస్తున్నారు. ఏ పనులు అయితే చేయకూడదో అదే పనులు చేస్తున్నారు. ఇకనైనా ఆదివారం పూట ఈ పనులు చేయకుండా ఉంటే సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.