NTV Telugu Site icon

IPhone : హౌరా.. పాత ఐఫోన్‌కు 57 లక్షలా..? ఎందుకంత డిమాండ్‌..

Iphone

Iphone

2007 మొదటి ఐఫోన్ విడుదలైంది. ఇది స్మార్ట్‌ఫోన్ భావనకు విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. అయితే.. అప్పట్లో యాపిల్ అధినేతగా ఉన్న స్టీవ్ జాబ్స్ ప్రవేశపెట్టిన ఈ ఫోన్ 3.5 అంగుళాల డిస్ ప్లే, 2 మెగాపిక్సెల్ కెమెరా, హోమ్ బటన్ వంటి క్లాసిక్ ఫీచర్లను కలిగి ఉంది. మొదటి ఐఫోన్ నేటికీ ఆపిల్ అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకం.

ఈ రోజుల్లో ఐఫోన్ స్టేటస్ సింబల్‌గా మారింది. ఐఫోన్ 15 గురించి ప్రస్తుతం ప్రపంచం మాట్లాడుతోంది. మరో విషయం ఏమిటంటే, ప్రతి వెర్షన్‌తో ఆపిల్ అప్‌డేట్‌లు మరియు ధరలను పెంచుతూనే ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఐఫోన్‌ను ఎవరు గుర్తుంచుకుంటారు? అని అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే.. ఇప్పుడు ఒక కొత్త వార్త టెక్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మొదటి మోడల్‌కు చెందిన ఒక ఐఫోన్ ఇప్పుడు 52 లక్షల రూపాయలకు వేలానికి వెళ్ళింది.

మొదటి మోడల్‌కు చెందిన ఐఫోన్‌లు భారీ మొత్తాలకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి కాదు. ఐఫోన్ ఫస్ట్‌ మోడల్‌కు అత్యధిక వేలం ధర 52 లక్షలు పలుకగా.. . అక్టోబర్ 2022లో ఇలాంటి ఐఫోన్ రూ. 32 లక్షలకు వేలం వేయబడింది.

Also Read : Mystery Revealed : మిస్సింగ్‌ రైలు మిస్టరీ వీడింది.. వేలకోట్లు విలువ చేసే సామాగ్రితో

వేలం సైట్ LCGలో విక్రయం జరిగింది. అన్‌ బాక్స్‌డ్‌ ఫస్ట్‌ మోడల్‌ ఐఫోన్ US$63,356.40కి విక్రయించబడిందని సైట్ పేర్కొంది. భారతీయ రూపాయిలోకి మార్చినప్పుడు, ఇది దాదాపు రూ. 52 లక్షలు అవుతుంది. 2023 వింటర్ ప్రీమియర్ వేలంలో పాత ఐఫోన్ వేలానికి వెళ్లింది. సైట్ ప్రకారం, వేలం ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 19 వరకు జరిగింది.

అమెరికాలోని న్యూజెర్సీలో టాటూ స్టూడియో నడుపుతున్న కరెన్ గ్రీన్ అనే మహిళ ఫోన్‌ను వేలం సైట్ విక్రయించింది. ఫ్యాక్టరీ సీల్‌ కూడా పగలని ఐఫోన్‌కు ఇంత ధర వచ్చిందని అంటున్నారు. ఇలా ఉపయోగించని ఫస్ట్‌ మోడల్‌ ఐఫోన్‌ను కనుగొనడం చాలా అరుదు.

కరెన్ గ్రీన్ ఈ ఐఫోన్‌ను బహుమతిగా అందుకుంది కానీ ఆమె ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే కొంత కాలం తర్వాత దానిని విక్రయించేందుకు ప్రయత్నించినా ఆశించిన సొమ్ము లభించలేదు. అదే సమయంలో గత అక్టోబర్‌లో పాత ఐఫోన్‌ భారీ మొత్తానికి వేలానికి వెళ్తున్నాయని గుర్తించింది. దీంతో వేలం స్థలానికి చేరుకుని ఒప్పందం చేసుకుంది. గ్రీన్ తన టాటూ స్టూడియోని పునరుద్ధరించడానికి వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించాలని అనుకంటున్నట్లు తెలిపింది.

Also Read : Etela Rajender : నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. కేసీఆర్‌కు ఈటల సవాల్‌