NTV Telugu Site icon

Gun Firing: ముంబైలో విచక్షణారహితంగా కాల్పులు.. ఒకరికి గాయాలు

Dmart

Dmart

Gun Firing: నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి 5-6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళన నెలకొనగా.. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వ్యక్తి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై సంపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Bhopal Gas Tragedy : ‘భోపాల్ గ్యాస్ దుర్ఘటన వ్యర్థాలను కాల్చడానికి అనుమతించం’..ఇండోర్ లోపోలీసులు లాఠీఛార్జ్

ఘటనకు సంబంధించి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిని పట్టుకుందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న దుకాణదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సాక్షులను విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. దాడి చేసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: IND vs AUS: మరోసారి నిరాశపరిచిన భారత్.. తక్కువ పరుగులకే ఆలౌట్

Show comments