NTV Telugu Site icon

Bihar: ప్యాసింజర్‌ రైలులో మంటలు.. ప్రయాణికులు సేఫ్..!

Bihar

Bihar

బీహార్‌లో మరో రైలుకు ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా ప్యాసింజర్‌ రైలులో మంటలు చెలరేగాయి. దీంతో.. ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటన కిషన్‌గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది. కిషన్‌గంజ్ నుండి సిలిగురికి వెళ్లే DMU ప్యాసింజర్ రైలు ఇంజిన్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వచ్చాయి. ఈ ప్రమాదం.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

Read Also: Anil Vij: బీజేపీ గెలిస్తే సీఎం పదవి అడుగుతా..హర్యానా నేత కీలక వ్యాఖ్యలు..

ఈ క్రమంలో.. ఫరింగోరా సమీపంలో రైలును వెంటనే ఆపేశారు. అయితే.. ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. కాగా.. ఈ అగ్నిప్రమాదం గురించి సమీపంలోని ప్రజలు రైల్వే పోలీసులకు, స్థానిక పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో.. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు.. ఎస్‌ఎస్‌బీ అధికారులు, సైనికులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడం ప్రారంభించారు.

Read Also: Physical Harassment: కోల్‌కతాలో మరో ఉదంతం.. ప్రభుత్వాసుపత్రిలో మహిళపై వేధింపులు

Show comments