NTV Telugu Site icon

Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.. 5 షాపులు దగ్ధం

Delhi Fire

Delhi Fire

ఢిల్లీలో అగ్ని ప్రమాద ఘటనలు రోజు రోజుకు అవుతున్నాయి. ఇప్పటికే చాందినీ చౌక్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడింది. ఈ ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే.. దేశ రాజధానిలో మరో ప్రమాదం సంభవించింది. దీంతో.. ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. ఢిల్లీలో ఎండలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్నాయి. ఆ కారణం చేత ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Read Also: Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే

శనివారం తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని ‘సి’ బ్లాక్‌లో ఉన్న ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక దుకాణంలో మంటలు చెలరేగి.. మెల్లగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. దీంతో.. కొద్దిసేపటికే 5 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం 10 అగ్నిమాపక వాహనాలు ఒక్కొక్కటిగా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు చాలా సేపు ప్రయత్నించారు. అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. అయినప్పటికీ అప్పటికే మంటల్లో 5 దుకాణాలు దెబ్బతిన్నాయి. కాగా.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

Read Also: AP Crime: రాజమండ్రిలో డబుల్‌ మర్డర్‌..! అన్నదమ్ముల మృతితో కలకలం

అగ్నిమాపక డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని.. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణ పరిస్థితుల మధ్య, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు గణనీయంగా పెరిగాయని ఆయన చెప్పారు.