NTV Telugu Site icon

Fire Accident: ఢిల్లీ చాందినీ చౌక్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం..

Fire Accident

Fire Accident

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చాందినీ చౌక్‌లోని మార్వాడీ కత్రాలో ఈరోజు సాయంత్రం భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో హుటాహుటిన 30 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. మరోవైపు.. ఇంత భారీ అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసు బృందాలు కూడా ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు

Read Also: Dry Coconut : ఎండు కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుతం మంటలను ఆర్పే పనులు కొనసాగుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది. తూర్పు ఢిల్లీలోని అసిత ఈస్ట్ వెనుక భాగంలో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే.. మంటలు ఆరకుండా అలానే అగ్గి రువ్వడంతో ఈరోజు సాయంత్రం 5:15 గంటల ప్రాంతాన భారీగా మంటలు చెలరేగాయి. అయితే.. అసిత ఈస్ట్‌లోని ప్రాంతంలో సంఘవిద్రోహులు మత్తు పదార్థాలను సేవించిన తర్వాత సిగరేట్లు కాల్చుకునే సమయంలో అగ్గిపుల్లతో నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. 8 అగ్నిమాపక యంత్రాలు రెండు గంటల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. మొత్తం మీద ఈ అగ్నిప్రమాదంలో 30 ఎకరాల పచ్చని ప్రాంతం కాలి బూడిదైంది.

Read Also: CM Chandrababu: ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వేడిగాలుల పరిస్థితుల కారణంగా అగ్ని ప్రమాదాల సంఘటనలు గణనీయంగా పెరిగాయి. మే మొదటి 20 రోజుల్లోనే తమకు 2,280 అగ్నిప్రమాదాల గురించి కాల్స్ వచ్చాయని అగ్నిమాపక శాఖ తెలిపింది. పెరిగిన అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి 33 అత్యాధునిక వాటర్ బౌజర్ వాహనాలను ప్రవేశపెట్టామని, అగ్నిమాపక సేవల సామార్థ్యాలను అప్ గ్రేడ్ చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. చాలా అగ్ని ప్రమాదాలకు షార్ట్ సర్క్యూట్లే కారణమని పేర్కొన్నారు.

Show comments