Site icon NTV Telugu

Fire Accident :పాతబస్తీ మొఘల్‌పురాలో ఓ గోదాంలో అగ్నిప్రమాదం

Fire

Fire

Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న గోదాంలో మొదలైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వ్యాపించాయి.

Kannappa : కన్నప్ప పై దుష్ప్రచారం.. లేఖ విడుదల చేసిన రచయిత

సమయానికి స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో ప్రాణాపాయం నుంచి తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు రక్షించారు. భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగతో సహాయ కార్యక్రమాలు కష్టతరంగా మారినా, ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇప్పటివరకు అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న మొఘల్‌పురా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు.

ENG vs IND: సెలెక్షన్‌ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్‌

Exit mobile version