Fire Accident : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ హైవేపై అగ్నిప్రమాదం

  • సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ హైవేపై అగ్నిప్రమాదం
  • కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో చెలరేగిన మంటలు
  • 8 కార్లు దగ్ధం.. మంటలు అదుపుచేసిన ఫైర్‌ సిబ్బంది
  • ముంబై నుంచి హైదరాబాద్‌ వస్తున్న కంటైనర్‌.
Fire

Fire

Fire Accident : కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి, నల్లటి పొగతో అల్లుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే మంటలు పూర్తిగా వ్యాప్తి చెందగా, కంటైనర్‌లోని 8 కొత్త కార్లు పూర్తిగా కరిగిపోయాయి. ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, మంటలు తీవ్రంగా వ్యాపించడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను సరిచేయడం ప్రారంభించారు.

IND vs SA: నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. మారిన టైమింగ్స్