కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి, నల్లటి పొగతో అల్లుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.