Fire Accident : అందరూ నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా భవనంలో మంటలు

Fire Accident

Fire Accident

పట్టణంలోనే పాత భవనాల్లో ఇదొకటి. అయితే.. ఆ భవనంలో ఉన్న వారందరూ నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఉన్న ప్రజలను కాపాడారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధానైనా ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున సౌత్ ముంబైలోని రద్దీగా ఉండే జవేరి నాజర్ ప్రాంతంలోని నివాస భవనంలో సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 60 మంది నివాసితులు రక్షించబడ్డారు. వీరిలో ఒకరు గాయపడినట్లు BMC విపత్తు నియంత్రణ తెలిపింది.

Also Read : Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె

×
×
Ad

ధుంజీ స్ట్రీట్‌లోని పాత ఆరు అంతస్తుల భవనంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. భవనంలోని అన్ని అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో ముంబై అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.

Also Read : Traffic restrictions: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మెట్ల మార్గం, పైకప్పు, భాగాలు కూలిపోవడం ప్రారంభించినప్పటికీ ముందుజాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది ప్రక్కనే ఉన్న భవనం మెట్లని ఉపయోగించి నివాసితులను త్వరగా ఖాళీ చేయించారు. పరాగ్ చకంకర్ (40) అనే వ్యక్తి , అగ్నిప్రమాదంలో కొన్ని స్వల్ప గాయాలకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాదాపు ఆరు గంటల పోరాటం తర్వాత, ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా ఆర్పివేయబడ్డాయి.