Fire Accident : అందరూ నిద్రిస్తున్న వేళ.. ఒక్కసారిగా భవనంలో మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పట్టణంలోనే పాత భవనాల్లో ఇదొకటి. అయితే.. ఆ భవనంలో ఉన్న వారందరూ నిద్రిస్తున్న వేళ ఒక్కసారిగా భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న వారు ఉలిక్కిపడ్డారు. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని భవనంలో ఉన్న ప్రజలను కాపాడారు. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధానైనా ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున సౌత్ ముంబైలోని రద్దీగా ఉండే జవేరి నాజర్ ప్రాంతంలోని నివాస భవనంలో సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో 60 మంది నివాసితులు రక్షించబడ్డారు. వీరిలో ఒకరు గాయపడినట్లు BMC విపత్తు నియంత్రణ తెలిపింది.
Also Read : Mother Dairy : మరో రూ.10 తగ్గిన మదర్ డెయిరీ ‘ధార’ వంట నూనె
Also Read
ధుంజీ స్ట్రీట్‌లోని పాత ఆరు అంతస్తుల భవనంలో తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. భవనంలోని అన్ని అంతస్తుల్లో మంటలు వ్యాపించడంతో ముంబై అగ్నిమాపక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.
Also Read : Traffic restrictions: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మెట్ల మార్గం, పైకప్పు, భాగాలు కూలిపోవడం ప్రారంభించినప్పటికీ ముందుజాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బంది ప్రక్కనే ఉన్న భవనం మెట్లని ఉపయోగించి నివాసితులను త్వరగా ఖాళీ చేయించారు. పరాగ్ చకంకర్ (40) అనే వ్యక్తి , అగ్నిప్రమాదంలో కొన్ని స్వల్ప గాయాలకు గురయ్యాడు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. దాదాపు ఆరు గంటల పోరాటం తర్వాత, ఎట్టకేలకు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మంటలు పూర్తిగా ఆర్పివేయబడ్డాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!