Traffic restrictions: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా శనివారం అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించనుంది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్, పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ రద్దీని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటుందని వెల్లడించారు. అంతేకాకుండా సస్పెన్షన్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీసులకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ మళ్లింపులు..
* ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వాహనాలను అబిడ్స్ జీపీఓ-నాంపల్లి స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు.
* ఎంజే బ్రిడ్జి, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వెళ్లే వాహనాలను అలాస్కా టవర్స్ వద్ద దారుస్సలాం, ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు.
* పిసిఆర్ జంక్షన్ నుండి నాంపల్లి వైపు వచ్చే వాహనాలను అవసరాన్ని బట్టి ఎఆర్ పెట్రోల్ పంప్ మరియు బిజిఆర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.
* నాంపల్లి వైపు నుండి కార్లలో వచ్చే వ్యక్తులు గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద తమ వాహనాలను పార్క్ చేసి, అజంతా గేట్ (2) నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వెళ్లాలి.
* వీఐపీ కారు పాస్ ఉన్న వారు ఎంజే మార్కెట్ నుంచి గాంధీభవన్‌కు వచ్చి ఎడమవైపు ఎగ్జిబిషన్ గ్రౌండ్ గేట్-1 వైపు, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు గాంధీభవన్ వద్ద యూ టర్న్ తీసుకుని గేట్-1, సీడబ్ల్యూ గేట్ మీదుగా ప్రవేశించాలి.
* చేప ప్రసాదం అనంతరం వీఐపీ వాహనాలు అదాబ్ హోటల్ నుంచి నాంపల్లి మీదుగా వీఐపీ గేట్, సీడబ్ల్యూసీ గేట్ మీదుగా బయలుదేరాలని సూచించారు.
Ponguleti: ఖమ్మం నడి బోడ్డునే పార్టీలో జాయిన్ అవుతా.. క్లారిటీ ఇచ్చిన పొంగులేటి