Site icon NTV Telugu

Bihar: బీహార్‌లో దర్భంగా డిఎంసిహెచ్ వైద్యుల పార్టీ.. డాక్టర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Bihar Doctors

Bihar Doctors

బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (డిఎంసిహెచ్) వైద్యుల మందు పార్టీ చేసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైద్యుల మద్యం పార్టీ చేసుకుంటున్న సమాచారంతో.. SSP అవకాష్ కుమార్ ఆదేశాల మేరకు సదరు SDPO అమిత్ కుమార్ నేతృత్వంలో శనివారం సాయంత్రం DMCH అతిథి గృహంలో దాడి చేశారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో.. వైరల్ అవుతున్న వీడియోపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: Draupadi Murmu: రేపు తెలంగాణకు రాష్ట్రపతి రాక.. షెడ్యూల్ ఇదే..

డిసెంబర్ 15 న DMCH గెస్ట్ హౌస్‌లో డాక్టర్లు మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. స్థానిక వైద్యులతో పాటు, బయటి నుండి వచ్చిన చాలా మంది వైద్యులు కూడా మద్యం సేవిస్తున్నట్లు కనిపించారు. ఈ అంశంపై ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. దర్బంగా మెడికల్ కళాశాల అతిథి గృహంలో దాడులు నిర్వహించగా, గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురు సీనియర్ వైద్యులు సైతం మద్యం సేవించినట్లు వీడియోలో ఉన్నట్లు చెప్పారు. ఈ వీడియోపై విచారణ జరుగుతోంది.. దోషులుగా తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్‌డిపిఓ అమిత్ కుమార్ తెలిపారు.

Read Also: Conference: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్..

ఇదిలాఉంటే.. శనివారం మాజీ ఎంపీ, జాప్‌ అధినేత పప్పు యాదవ్‌ సోషల్‌ మీడియాలో మద్యం పార్టీ ఫొటోను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మద్య నిషేధం విషయంలో నితీష్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీహార్‌లో పేదలకు, వైద్యులకు ప్రత్యేక నిషేధ చట్టం ఉందని పప్పు యాదవ్ అన్నారు. ఈ విషయంపై సీఎం నితీశ్‌ వెంటనే స్పందించాలని పప్పు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (DMCH) “షరాబ్, షబాబ్, కబాబ్ (మహిళలకు హబ్, వైన్ & డైన్) కోసం అడ్డా”గా మారిందని పప్పు యాదవ్ ఆరోపించారు. జైలులో ఉన్న తనను చికిత్స కోసం తీసుకెళ్లినప్పుడు ప్రత్యక్షంగా చూశానని పప్పు యాదవ్ పేర్కొన్నారు.

Exit mobile version