NTV Telugu Site icon

Voters List : తెలంగాణలో తుది ఓటర్ల జాబితా విడుదల..

Voters List

Voters List

పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుషులు 1,64,47,132, మహిళలు 1,65,87,244, థర్డ్ జెండర్ 2,737 మంది ఉన్నారు. 15,378 సర్వీస్ ఓటర్లు, 3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 7,47,726 మంది ఓటర్లు ఉంటే.. రాష్ట్రంలో అత్యల్పంగా భద్రాచలంలో 1,51,940 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా జాబితాలో ఎన్నికల సంఘం వెల్లడించింది.

Heartbreaking story: ట్రెక్కింగ్‌కి వెళ్లి ఇద్దరు మృతి.. రెండు రోజుల పాటు డెడ్‌బాడీలకు కుక్క కాపలా.. 

తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువతీయువకులు కొత్తగా ఓటు కోసం అప్లయ్ చేసుకోవచ్చునని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తుది జాబితా ప్రచురించబడినప్పటికీ, ఓటర్ల జాబితాను నిరంతరం ఆప్డేట్‌ చేయబడుతుందన్నారు. ముందుగా ఎన్‌రోల్‌మెంట్ కోసం తమ దరఖాస్తును సమర్పించలేని అర్హులైన వ్యక్తులందరూ (జనవరి 1, 2024న 18 సంవత్సరాలు నిండిన వారు, ఇతరత్రా అర్హత ఉన్నవారు) దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు. పౌరులందరూ ఓటర్లు eci.gov.in కి లాగిన్ చేయడం ద్వారా లేదా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ (VHA) ద్వారా వారు జతచేయబడిన పోలింగ్ స్టేషన్ వంటి వారి నమోదు వివరాలను తనిఖీ చేయాలని అభ్యర్థించారు. ఎన్‌రోల్‌మెంట్ వివరాలలో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఓటర్లు ఫారమ్ 8ని ఉపయోగించి ఆన్‌లైన్ లేదా VHA లేదా BLO (బూత్ లెవల్ ఆఫీసర్) ద్వారా దిద్దుబాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Uttarakhand: అక్రమ మదర్సా కూల్చివేతతో అల్లర్లు.. “షూట్-ఎట్-సైట్” ఆర్డర్స్ జారీ..