Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్.. బాబు బాగోతం మాములుగా లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake IPS Officer: ఫిల్మ్నగర్లో నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్ట్ కలకలం సృష్టించింది.. బాబు బాగోతం మామూలుగా లేదు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారి అంటూ శశికాంత్ అనే వ్యక్తి మోసాలకు పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. ఇద్దరు గన్మెన్లను పెట్టుకుని బిల్డర్లపై శశికాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు.. స్పెషల్ ఆఫీసర్ అంటూ బిల్డర్లతో డబ్బులు వసూళ్లకు పాల్పడ్డాడు.. పలు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్ల దగ్గర డబ్బులు వసూళ్లు చేశాడు.. తీసుకున్న డబ్బు ఇవ్వకుండా గన్మెన్లతో బెదిరింపులకు దిగాడు.. ఈ నిందితుడిపై పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు.
READ MORE: CM Chandrababu: చాయ్‌వాలా దేశానికి ప్రధాని కావడం అనేది రాజ్యాంగం ఇచ్చిన గొప్ప వరం..
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
ఈ అంశంపై వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాసులు మాట్లాడారు. “శశికాంత్ ఇద్దరు బాడీగార్లను పెట్టుకుని మోసాలకు పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన ఇద్దరు బాడీగార్డ్‌లను తమ ఆయుధాలతో వెంట ఉండేవారు.. వాహనాలకు పోలీస్ సైరన్లతో పాటుగా వాకీటాకీలను పెట్టుకుని నమ్మించాడు.. శశికాంత్ టీఎస్ ఐఐసీకి చెందిన ఫోర్జ్‌రీ లెటర్‌ను దగ్గర పెట్టుకొని అది చూపిస్తూ పలువురిని మోసాలకు పాల్పడ్డాడు. టీఎస్ ఐఐసీలో ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పి గోల్డ్ జిమ్ ఓనర్ తో పాటు పలువురిని మోసం చేశాడు. గోల్డ్ జిమ్ నిర్వాహకుడు అలీ హసన్ దగ్గర 10 లక్షల రూపాయల మేర నమ్మించి వసూలు చేశారు. జిమ్ సూపర్వైజర్ దగ్గర కూడా 8 లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇంటి యజమానిని కూడా నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసి శశికాంత్‌ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుడి దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లో ఆర్ సిమ్ కార్డులు రెండు వాకీ టాకీలు, నకిలీ గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నాం. లైసెన్సుడు ఆయుధాలు కలిగిన వారు తమ పర్సనల్ ప్రొటెక్షన్ కోసమే వాడాలి. ఇతరుల రక్షణ కోసం వాడొద్దు. ఇది చట్టరీత్యా నేరం.. తమిళనాడుకు చెందిన లైసెన్సు హోల్డర్లు ఇక్కడ గన్మెన్లుగా వ్యవహరించారు.. వీరిపై కేసులు నమోదు చేశాం.. ప్రభుత్వ అధికారులమని చెప్పి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఎవరు కూడా అలాంటి వారిని నమ్మి మోసపోవద్దు..” ” అని డీసీపీ శ్రీనివాసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..