Bulls Fight in Uttarakhand one Purse Shop: ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గర్వాల్ లో ఓ భయానకమైన సీసీటీవీ ఫుటేజీ బయటపడింది. ఆ వీడియోలో రెండు ఎద్దులు పోరాడుతూ ఒక దుకాణంలోకి ప్రవేశించాయి. దుకాణంలో అప్పటికే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఎద్దులను చూసి అమ్మాయిలు అక్కడే షాప్ లో ఓ మూలన నిలబడ్డారు. వాళ్ళు అక్కడ నిలబడి సహాయం కోసం అరవడం వీడియోలో గమనించవచ్చు. మరో మార్గం లేకపోవడంతో అమ్మాయిలు అక్కడే చిక్కుకుపోయారు. ఇంతలో ఎద్దులు పోట్లాడుకుంటూ వారి దెగ్గరకు చేరుకున్నాయి. అయితే అక్కడి నుండి తప్పించుకొనేందుకు ప్రయత్నాలు చేసిన రెప్పపాటులో అమ్మాయిలిద్దరూ కిందపడిపోతారు. దాంతో ఒక ఎద్దు వారి పైకి పడింది.
Yashasvi Jaiswal Record: టీ20ల్లో కనివినీ ఎరుగని రికార్డు.. మన యశస్వి జైస్వాల్ సొంతం!
సమాచారం ప్రకారం.. ఈ సంఘటన రామ్ జూలా వంతెన సమీపంలోని ఓ పర్సు దుకాణంలో జరిగింది. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిలిద్దరూ ఒకే షాపులో పనిచేస్తున్నారు. ఒక నిమిషం ఏడు సెకన్ల వీడియోలో, దుకాణంలో నిలబడటానికి కాస్త ఇరుకైన స్థలం మాత్రమే ఉన్నట్లు చూడవచ్చు. దుకాణంలో మిగిలిన భాగం వస్తువులతో నిండి ఉంది. అప్పుడే అనుకోకుండా సడెన్ గా దుకాణంలోకి రెండు ఎద్దులు వచ్చాయి. దాంతో ఇద్దరు అమ్మాయిలు పరుగెత్తి ఓ మూలలో నిలబడతారు. ఆపై నెమ్మదిగా ఎద్దులు దుకాణంలోకి పూర్తిగా ప్రవేశించాయి.
EURO Cup Final: నాలుగో సారి యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న స్పెయిన్
వీడియోలో గమనించినట్లైతే ఓ అమ్మాయి ర్యాక్ పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఎద్దు దాడికి బాలికలిద్దరూ నేలపై పడిపోయారు. ఈ క్రమంలో షాపులో ఉన్న పలు వస్తువులు కూడా అమ్మాయిలపై పడుతున్నాయి. దీని తరువాత వెనుక నిలబడి ఉన్న ఒక ఎద్దు అమ్మాయిలిద్దరిపైకి దూకడం మొదలు పెట్టింది. అలా కొంత సమయం తరువాత ఒక వ్యక్తి కర్రతో దుకాణంలోకి ప్రవేశించి రెండు ఎద్దులను బయటకు పంపించాడు. ఈ బుల్ ఫైట్ లో అమ్మాయిల పై షాపు సామాగ్రి పడిపోయినందున వారికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.
दो सांडों की लड़ाई में दोनों लड़कियों की जान पर बन आई। गनीमत रही दुकान में रखा सामान लड़कियों पर गिरा जिससे वो बच गईं,वीडियो ऋषिकेश में मुनिकिरेती राम झूले का है।
यहां के लोगों ने कई बार आवारा पशुओं की समस्या प्रशासन से की लेकिन कुछ हुआ नहीं।@pushkardhami @uttarakhandcops pic.twitter.com/TZHNo5tCPM— Naina Yadav (@NAINAYADAV_06) July 12, 2024