NTV Telugu Site icon

Loksabha Election 2024: రేపు ఐదో దశ ఓటింగ్.. ప్రత్యేక విజ్ఞప్తి చేసిన ఈసీ

5th Phase Voteing

5th Phase Voteing

రేపు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పలు రాష్ట్రాల్లో ఐదో దశ ఓటింగ్ జరుగనుంది. అందుకు సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. ఐదో విడత పోలింగ్‌కు ముందు ఓటర్లకు ఈసీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని కోరింది. ముఖ్యంగా పట్టణ ప్రజలకు ఎన్నికల సంఘం ప్రత్యేక అభ్యర్థన చేసింది. ముంబై, థానే, లక్నో వంటి నగరాల్లో గత ఎన్నికల్లో ఓటింగ్ పట్ల తేడా కనిపించిందని కమిషన్ చెబుతోంది.

Pavithra Naresh: అందుకే పవిత్రని ప్రేమించిన నరేష్.. ఇలా ఓపెన్ అయిపోయాడేంటి?

ఇతర నగరాలతో పోలిస్తే మెట్రోపాలిటన్ నగరాల్లో రెండో దశలో కూడా ఓటింగ్ తక్కువగా నమోదైందని కమిషన్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటింగ్‌కు ముందు పెద్ద నగరాల ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని, తక్కువ ఓటింగ్ శాతం ధోరణిని మార్చాలని కమిషన్ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. మరోవైపు.. పట్టణ ఓటర్లలో ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి ఈసీ.. మెట్రో నగరాల కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించింది. గత నాలుగు దశల్లో ఇప్పటి వరకు 66.95 శాతం ఓటింగ్‌ జరిగినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఇందులో దాదాపు 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 97 కోట్లు ఉన్నారు.

PM Modi: సోనియా గాంధీ రాయ్‌బరేలిని వదిలేసి, ఇప్పుడు కొడుకు కోసం ఓట్లు అడుగుతున్నారు..

నాలుగు దశల్లో జరిగిన ఓటింగ్‌లో ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఓటింగ్‌ పూర్తయింది. సోమవారం ఐదో దశ ఎన్నికల్లో బీహార్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్‌తో సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 49 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. దీంతో పాటు ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారం ఓటింగ్ జరగనుంది. ఈ సమయంలో 94,732 పోలింగ్‌ కేంద్రాల వద్ద 9.47 లక్షల మంది పోలింగ్‌ అధికారులను నియమించనున్నారు. ఐదో దశలో మొత్తం 8.95 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్ల మంది మహిళలు మరియు 5409 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.