FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA Worldcup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అద్భుతమైన ఆరంభాన్ని కొనసాగిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభమైన కేవలం ఆరు రోజులకే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 16న జరిగిన 4 గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 2,81,223 మంది అభిమానులు హాజరై ప్రపంచకప్ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక ప్రేక్షకుల హాజరు రికార్డును సృష్టించారు.
ఇంతకుముందు 1994 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జూన్ 28న నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,77,070 మంది ప్రేక్షకులు హాజరుకాగా.. అది ఇప్పటివరకు అత్యధిక రోజువారీ హాజరు రికార్డుగా నిలిచింది. ఇప్పుడు 2026 ప్రపంచకప్ ఆ రికార్డును అధిగమించి కొత్త మైలురాయిని చేరుకుంది. జూన్ 16న జరిగిన ఫ్రాన్స్-సెనెగల్, ఇరాక్-నార్వే, అర్జెంటీనా-అల్జీరియా, ఆస్ట్రియా-జోర్డాన్ మ్యాచ్‌లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్టేడియాలన్నీ ప్రేక్షకులతో నిండిపోవడంతో ఫుట్‌బాల్ పండుగను తలపించే వాతావరణం నెలకొంది.
Also Read
- Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
టోర్నమెంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13,09,652 మంది అభిమానులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రతి మ్యాచ్‌కు సగటున 65,483 మంది ప్రేక్షకులు హాజరవుతుండటం విశేషం. ఈ వేగం కొనసాగితే గ్రూప్ దశ ముగిసేలోపే 1994 ప్రపంచకప్‌లో నమోదైన 35 లక్షల మొత్తం ప్రేక్షకుల రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ చారిత్రాత్మక ఘట్టంపై ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో హర్షం వ్యక్తం చేశారు. “ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక ప్రేక్షకులు హాజరైన రోజు ఇది. అభిమానులు తీసుకొచ్చిన ఉత్సాహం, రంగుల హంగులు, భావోద్వేగాలు ఈ టోర్నమెంట్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి” అని ఆయన అన్నారు. అలాగే, “ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకం చేస్తుందనే విషయాన్ని ఫిఫా వరల్డ్ కప్ 2026 మరోసారి నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆటపై ఉన్న ప్రేమను అభిమానులు తమ హాజరుతో చాటిచెప్పారు” అని అన్నారు.
ప్రపంచకప్ మ్యాచ్‌లకు టికెట్లపై భారీ డిమాండ్ కొనసాగుతోందని ఫిఫా తెలిపింది. అభిమానులు టికెట్ల లభ్యత కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని సూచించింది. ప్రపంచకప్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫిఫా లాభాపేక్ష లేకుండా ప్రపంచవ్యాప్తంగా పురుషులు, మహిళలు, యువత ఫుట్‌బాల్ అభివృద్ధికి వినియోగిస్తోంది. తమ 211 సభ్య దేశాల ఫుట్‌బాల్ కార్యక్రమాలకు ఈ నిధులను తిరిగి పెట్టుబడిగా మళ్లిస్తున్నట్లు ఫిఫా వెల్లడించింది.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..