పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FIFA World Cup 2026 Fever Reaches Norway Parliament: ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫీవర్ అభిమానులకే కాకుండా.. రాజకీయ నాయకులనూ వదలడం లేదు. నార్వే జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా ఆ దేశ పార్లమెంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్వే అభిమానులు ప్రాచుర్యంలోకి తెచ్చిన “వైకింగ్ రోయింగ్” (పడవ నడిపే చర్య)ను పార్లమెంట్ సభ్యులే అనుకరించడం సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
బోస్టన్‌లో జరిగిన వరల్డ్‌కప్ గ్రూప్-I మ్యాచ్‌లో నార్వే జట్టు ఇరాక్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఎరుపు రంగు దుస్తులు ధరించిన నార్వే అభిమానులు, చాలామంది వైకింగ్ హెల్మెట్లు పెట్టుకుని తమ సముద్రయాన వారసత్వాన్ని గుర్తుచేస్తూ “వైకింగ్ రోయింగ్” ప్రదర్శించారు. బార్లు, ప్రజా రవాణా వాహనాలు, స్టేడియం పరిసరాలు, ఎస్కలేటర్లపై కూడా అభిమానులు ఒకే రీతిలో పడవ నడిపే కదలికలను చేస్తూ జట్టుకు మద్దతు తెలిపారు.
Also Read
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్‌లోకి రా.!" హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
- Akshara Gupta: దేశీయ క్రికెట్లో విధ్వంసం.. 126 బంతుల్లోనే 306 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ కంటే డేంజర్‌గా ఉందే.!
- Mojtaba Khamenei: "ఆయన హామీతోనే ఓకే చెప్పా".. అమెరికా-ఇరాన్ డీల్‌పై సుప్రీంలీడర్ షాకింగ్ కామెంట్స్..
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
అభిమానుల ఈ వినూత్న మద్దతు పార్లమెంట్ సభ్యులను కూడా ఆకట్టుకుంది. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశంలో స్పీకర్ స్వల్ప విరామం తీసుకుని, దేశ జట్టుకు మద్దతుగా అభిమానులు చేస్తున్నట్లే “వైకింగ్ రోయింగ్” చర్యను సభ్యులందరూ అనుకరించాలని సూచించారు. దీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు ఉత్సాహంగా స్పందించి, అందరూ ఏకమై ఆ చర్యను ప్రదర్శించారు.
ఈ సంఘటన నార్వేలో ఫుట్‌బాల్‌పై ఉన్న అభిమానాన్ని, జాతీయ జట్టుపై ఉన్న ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపించారు. రాజకీయ భేదాలను పక్కనపెట్టి దేశ జట్టుకు మద్దతుగా పార్లమెంట్ సభ్యులు ఒకే వేదికపై నిలవడం విశేషం. ఇక వరల్డ్‌కప్‌లో నార్వే తన తదుపరి గ్రూప్-I మ్యాచ్‌ను జూన్ 22న సెనెగల్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే నాకౌట్ దశకు అర్హత సాధించనున్నాయి.
The Norwegian parliament doing the Norwegian World Cup chant! Nothing unites a country quite like football and sports! Wonderful! Go Norway! 🇳🇴 pic.twitter.com/n7XpkgVvJG
— Robin Tveit (@robin_tveit) June 18, 2026
తాజావార్తలు
-
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Oppo Reno 15A 5G: ఒప్పో రెనో 15A 5G రిలీజ్.. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP సెల్ఫీ కెమెరా
-
Vivo Y6e 5G: Snapdragon 4 Gen 2 చిప్సెట్, 6,500mAh బ్యాటరీతో.. వివో Y6e 5G స్మార్ట్‌ఫోన్ విడుదల
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్‌లోకి రా.!” హర్భజన్ సింగ్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..