Site icon NTV Telugu

MLA Laxma Reddy : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు

Laxmareddy

Laxmareddy

దోనూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పోర్ల జంగయ్య, మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో 48 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి లక్ష్మారెడ్డి అభివృద్ధిని చూసి రాబోయే కాలంలో మరింత అభివృద్ధి సమకూర్చేందుకు పార్టీలో చేరడం జరిగిందన్నారు. అంతేకాకుండా అని లక్ష్మారెడ్డి గారిని తమ ఊరి నుంచి ప్రతి ఓటు మీకే వేస్తామని హామీ ఇచ్చి పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో లోకిరేవు గ్రామ కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Also Read : Wasim Akram: సొంత టీమ్పై మండిపాటు.. రోజూ 8 కేజీల మటన్ తింటే ఇలానే ఉంటుంది

Mla Laxma Reddy

వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోకిరేవు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుధకర్, వెంకటేష్, కుమార్ లతో సహా 10 మంది బీఆర్ఎస్‌లో చేరారు. బీజేపీ నుండి రవి ఆధ్వర్యంలో పలువురు యువత బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీలో నుంచి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.

Also Read : Purandeshwari: ఏపీ ఆర్థిక అంశాలపై నిర్మలా సీతారామన్ కి బీజేపీ ఏపీ చీఫ్ వినతి పత్రం

Exit mobile version