Fetus in Brain: ఓ అసాధారణ ఘటనతో ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. ప్రస్తుతం ఇది సైన్స్ కే ఒక సవాల్ విసిరింది. ఓ బాలిక తలలో గర్భం దాల్చిన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే బాలిక వయస్సు కేవలం ఒక సంవత్సరం. ఆమె తలలో బిడ్డ పెరుగుతున్నట్లు వైద్యుల పరీక్షల్లో తేలింది. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ కూడా ఈ దృగ్విషయాన్ని వెల్లడించింది. అకాడమీకి చెందిన న్యూరాలజీ జర్నల్‌లో దీనిపై కథనం ప్రచురితమైంది. ఐతే ఈ అద్భుతం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఏడాది వయసున్న ఓ బాలిక తల ఒక్కసారిగా పెరగడం ప్రారంభించింది. ఆమె తల బెలూన్ లాగా పెరుగుతోంది. దాంతో వైద్యులు ఆమె తలను పరిశీలించారు. అప్పుడు ఆమె తలలో ఒక పిండం అభివృద్ధి చెందడం కనిపించింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి పిండాన్ని తొలగించారు. బాలిక ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు డాక్టర్ ఈ ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ అమ్మాయి తన తల్లి కడుపులో ఉన్నప్పుడే తలలో ఈ పిండం పెరగడం ప్రారంభమైందని భావిస్తున్నారు.
Read Also: Shocking news: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే.. షాకింగ్ న్యూస్ చెప్పిన డాక్టర్
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టబోయే బిడ్డ పొడవు నాలుగు అంగుళాలు. నడుము, ఎముకలు అభివృద్ధి చెందాయి. పిండం వేళ్లకు కూడా గోళ్లు ఉన్నాయి. ఈ అమ్మాయి జన్మించిన తర్వాత, ఆమె తలలో కొత్త పిండం పెరుగుతోందని గుర్తించలేదు. ఈ చిన్నారి తల పరిమాణం ఒక్కసారిగా రోజురోజుకు పెరగడం ప్రారంభించినప్పుడు, శిశువు తలలో పిండం పెరుగుతున్నట్లు గుర్తించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అమ్మాయి తలలో పిండం పెరగడం వల్ల చిన్నారి ఎదుగుదల కూడా మందగించింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు చికిత్స అందించారు. శస్త్రచికిత్స ద్వారా ఆమె తల నుండి పిండాన్ని తొలగించారు.
200 సంఘటనలు జరిగాయి
ఈ పదాన్ని వైద్య భాషలో fetus in fitu అంటారు. ఇందులో కవలలు గర్భంలో కలిసిపోతారు. కవలలు గర్భంలో ఒకదానికొకటి వేరు చేయబడవు. అక్కడే అవి పెరగడం ప్రారంభిస్తాయి. అందుకే ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ ఇటువంటి కేసులు సంభవించాయి. చాలా సందర్భాలలో, పిండం తల నుండి తొలగించబడుతుంది.