కేంద్ర ప్రభుత్వం కుటుంబ పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలలో కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. గతంలో మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు.. అయితే, ఇంతకు ముందు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామ్యానికి కుటుంబ పెన్షన్ ఇచ్చేవారు. జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణం తరువాత మాత్రమే ఇతర కుటుంబ సభ్యులు అర్హులుగా ఉండేవారు అన్నమాట. ఇక, ఈ కొత్త నిబంధనతో భర్తతో కలిసి లేని.. విడాకులు తీసుకున్న మహిళలకు ఉపశమనం దొరుకుతుంది. అలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్ ను కాపాడుకొవచ్చు అన్నమాట.
Read Also: Fighter: సింగిల్ డిజిట్ కి పడిపోయిన సినిమా…
ఇక, నామినీగా భర్తను కాకుండా పిల్లలను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఒకవేళ పిల్లలు మైనర్లు అయినా, దివ్యాంగులు ఐనా ఆ పెన్షన్ పిల్లల సంరక్షకులకు వెళ్తుంది. పిల్లలు మేజర్లు అయ్యాక వారు నేరుగా ఈ పెన్షన్ పొందుతారు. ఈ కొత్త రూల్ పై కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విడాకులు, గృహ హింస, వరకట్నం కేసులు కోర్టులో ఉన్న టైంలోనూ పింఛను చెల్లింపులో వచ్చే సమస్యను పరిష్కరించడం ఈజీ అవుతుంది.
Read Also: Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ సతీమణి?
అయితే, తన మరణానంతరం మహిళా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ భర్తకు కాకుండా పిల్లలకు కుబంబ పింఛన్ ను చెల్లించాలంటే.. మహిళా ఉద్యోగి సంబంధిత కార్యాలయ ఆఫీసర్ కి రాతపూర్వకంగా అభ్యర్థన చేయాల్సి ఉంటుంది. ఇక, ఈ అభ్యర్థన లేఖలో తప్పని సరిగా తన భర్త కంటే ముందు కొడుకు లేదా కూతురుకు కుటుంబ పింఛన్ ఇవ్వాలని వెల్లడించాలి. ఒకవేళ పిల్లలు లేకుంటే ఆమె భర్తకే పింఛన్ అందుతుంది. ఈ లేఖ ప్రకారం ఆమె మరణానంతరం ఫించన్ ను అందిస్తారు.