Jangaon District: ఆస్తి కోసం ఇద్దరు కుమారులను లేపేయడానికి తండ్రి మాస్టర్ ప్లాన్.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jangaon: సాధారణంగా ఆస్తి కోసం తల్లిదండ్రులు కుమారులు చంపేసే ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆస్తి కోసం ఓ తండ్రి కన్న కొడుకులను లేపేయడానికి మాస్టార్ ప్లాన్ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న కొడుకులకు బిస్కట్‌లో విషం ఇచ్చి చంపాలని సుపారీ ఇచ్చాడు తండ్రి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బడి తండాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 2016 సంవత్సరంలో బానోతు శ్రీనివాస్ అనే వ్యక్తి అనితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాల నేపథ్యంలో వేరే గ్రామానికి చెందిన మూడవత్ మమతను రెండోవ వివాహం చేసుకున్నాడు శ్రీనివాస్. కుమారుల పేరిట 20 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఎలాగైన కాజేయాలని ప్లాన్ చేశాడు. పిల్లలు తినే బిస్కట్‌లో విషం పెట్టి చంపాలని రెండవ భార్యతో కలిసి పన్నాగం పన్నాడు. ఈ సుపారీని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి అప్పగించాడు కిరాతక తండ్రి. ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. పిల్లలు భయంతో గ్రామంలో ప్రజలకు సమాచారం ఇవ్వడంతో ఈ తతంగం బయట పడింది. ఇక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
READ MORE: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం.. ఇది కూడా ఉందా..?
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!