NTV Telugu Site icon

Maharashtra: ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ, మరదలికి పంచాయితీ షాక్..

Mh News

Mh News

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వివాహం చేసుకున్నందుకు పెళ్లికుమార్తెకు గ్రామస్థులు శిక్ష విధించారు. సొసైటీ అనుమతి లేకుండా మామని ప్రేమ వివాహం చేసుకున్నారని పంచాయితీ తీర్పునిచ్చింది. అందువల్ల రూ.2.5 లక్షల జరిమానా విధించింది. దీంతో పాటు ఏడు తరాల పాటు ఈ కుటుంబాన్ని సమాజం నుంచి బహిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాధిత మహిళ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 9 మందిపైగా గ్రామ పెద్దలపై కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన 22 సెప్టెంబర్ 2024న అష్టి తాలూకాలోని దోయితాన్ గ్రామంలో జరిగింది. ఈ విషయం బయటకు గ్రామస్థులు అణచివేసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అయితే ఆ మహిళ ధైర్యం చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

READ MORE: Ujjain Mahakal Temple: కూలిన ఉజ్జయిని మహాకాల్ ఆలయ గోడ.. శిథిలాల కింద పలువురు..!

అసలు ఏమైదంటే.. దోయితాన్ గ్రామానికి చెందిన మహిళ మలన్ ఫూల్మాలి తన బావ నరసు ఫూల్మాలి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. సొసైటీ అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామ పెద్దలు ఫైర్ అయ్యారు. విషయం వెలుగులోకి రావడంతో కుల పంచాయితీ నరసు ఫూల్మాలికి రూ.2.5 లక్షల జరిమానా విధించింది. కానీ చాలా సంవత్సరాలు గడిచినా జరిమానా చెల్లించకపోవడంతో, కుల పంచాయితీ మాలన్, ఆయన కుటుంబాన్ని ఏడు తరాల పాటు సంఘం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. మహిళ ఫిర్యాదు మేరకు సామాజిక బహిష్కరణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసును సీరియస్‌గా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ ప్రకారం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Show comments