Father Funeral Rites: మధ్యప్రదేశ్‌లోని తికమ్గఢ్ జిల్లా లిధౌరా తాల్ గ్రామంలో ఒక అసాధారణ ఘటన చోటుచేసుకుంది. 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ అనే వ్యక్తి మరణానంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఇద్దరు కుమారులు దామోదర్, కిషన్ సింగ్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం ఎంతంగా ముదిరందంటే.. చివరకు తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరూ విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించేంతగా. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం ధ్యాని సింగ్ మృతి చెందారు. ఆ తర్వాత చిన్న కుమారుడు దామోదర్ తన తండ్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి గ్రామస్థులను, బంధువులను ఆహ్వానించాడు. ఇదే సమయంలో పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్ కూడా వచ్చి తండ్రి అంత్యక్రియలు తాను నిర్వహిస్తానని అన్నాడు. అయితే, తండ్రి చివరి రోజులు తనతో గడిపాడనే కారణంతో దామోదర్ ఈ విషయాన్ని అంగీకరించలేదు.
Also Read: CM Chandrababu: నేడు స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ భేటీ.. ఆ పథకాలపై సీఎం కసరత్తు..
ఇంకేముంది ఆ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా తీవ్ర గొడవగా మారింది. గ్రామస్తులు, బంధువులు అన్నదమ్ములిద్దరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించాలని నచ్చజెప్పినా కిషన్ సింగ్ ఒప్పుకోలేదు. చివరికి, తండ్రి మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి, ఇద్దరూ తమకు నచ్చినట్లుగా అంత్యక్రియలు నిర్వహించాలని భావించారు. అక్కడి పరిస్థితిని చూసిన గ్రామస్థులు భయభ్రాంతులకు గురై, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానితో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, అంత్యక్రియల బాధ్యతలను పెద్ద కుమారుడు కిషన్ సింగ్ ఘోష్‌కు అప్పగించారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగి చివరకు ధ్యాని సింగ్ ఘోష్ అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యాయి.
Also Read: TGCHE: ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారా?.. ఇకపై ఒక్కో ప్రశ్నకు రూ. 500 ఫీజు
ఈ ఘటన కుటుంబ విభేదాలు ఎంతకైనా దారి తీస్తాయనే దానికి ఒక ఉదాహరణ. తండ్రి అంత్యక్రియల సమయంలో కూడా సోదరులు ఓకటిగా ఉండలేకపోవడం, మృతదేహాన్ని సైతం విడగొట్టాలనే ఆలోచనకు రావడం నిజంగా విచారకరం. కుటుంబ కలహాలను అధిగమించి, సమర్థవంతమైన పరిష్కార మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సంఘటన నిదర్శనం.