Fatehpur: పట్టపగలు నడిరోడ్డుపై విద్యార్థినిని వేధించిన కంత్రీగాళ్లు.. దిమ్మతిరిగే పనిచేసిన పోలీసులు.!

Fatehpur

Fatehpur

Fatehpur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్‌పూర్ జిల్లాలో స్కూల్‌ కు వెళ్తున్న విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఫతేహ్‌పూర్ కోత్వాలి పరిధిలోని ఐటీఐ రోడ్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్‌కు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వారిని వెంబడించడం ప్రారంభించారు. మొదట అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారు, ఆ తర్వాత ఒక విద్యార్థినిని బలవంతంగా ఆపి చేతిని పట్టుకున్నారు. అయితే ఆ విద్యార్థిని ధైర్యంగా ఎదుర్కొని వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పరుగెత్తింది.

Apple CEO: టిమ్ కుక్ రాజీనామా.. కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ బాధ్యతలు.!

ఈ మొత్తం ఘటనను ఒక వ్యక్తి వీడియోగా చిత్రీకరించగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో చూసిన పోలీసుల టీం ఎలాంటి ఫిర్యాదు కోసం వేచి ఉండకుండా కొత్త కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. బైక్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో నిందితులు గాయాలతో కనిపిస్తూ క్షమాపణలు కోరుతున్నట్లు కనిపించారు. ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో చట్టం సహా పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా వారి బైక్‌ ను మోటార్ వాహన చట్టం సెక్షన్ 207 కింద సీజ్ చేశారు. ఈ ఘటనపై ఫతేహ్‌పూర్ పోలీస్ అధికారి అభిమన్యు మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను ఏ మాత్రం సహించబోమని, నిందితులపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

Crime News: 11 ఏళ్ల బాలుడి గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని డ్రమ్‌లో దాచిన నిందితుడు.!