మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్తున్న ఆరుగురు మృత్యువాత చెందారు. ఖతుశ్యామ్ బాబాను దర్శించుకునేందుకు వెళ్తుండగా జైపూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తు తెలియని వాహనం భక్తులతో వెళ్తున్న కారును ఢీకొట్టింది.. అనంతరం ప్రమాదం చేసిన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ప్రమాదానికి గురైన కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీయడానికి చాలా కష్టమైంది. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీశారు.
PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం
ఈ ప్రమాదంలో గాయపడిన మనోజ్, ప్రదీప్, అనికేత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా దేవాస్ నివాసితులు. కాగా.. ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించారు. ఈ ప్రమాదంలో.. మదన్, మంగీలాల్, మహేష్, రాజేష్, పూనమ్ మృతి చెందారు. మరొకరి వివరాలు తెలియరాలేదు. మరోవైపు.. పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం మార్చురీకి తరలించారు. అనంతరం.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Bihar: పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైల్ ఇంజన్.. తప్పిన ప్రమాదం
కాగా.. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కంకరతో నిండిన డంపర్ రాంగ్ సైడ్ నుంచి ఢీ కొట్టినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. X లో స్పందిస్తూ.. ‘ప్రమాదంలో గాయపడిన వారికి సరైన చికిత్స అందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని బాబా మహాకల్ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దుఃఖ సమయంలో, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ అని పేర్కొన్నారు.