ఆ రైతులు పొలం పనులకు వెళ్లాలంటే గజగజ వణికిపోతున్నారు. కాలు బయటపెడితే మేకులు ఉన్న బెల్టులు మెడలో ధరించి వెళ్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మహారాష్ట్రలోని పూణేలో చిరుతలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పింపర్‌ఖేడ్ గ్రామంలో, చిరుతపులి భయం చాలా తీవ్రంగా ఉంది. ప్రాణాంతక దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి నివాసితులు స్పైక్డ్ కాలర్‌లను ధరిస్తున్నారు. కేవలం ఒక నెలలోనే, 5 ఏళ్ల బాలిక, 82 ఏళ్ల వృద్ధురాలు, 13 ఏళ్ల బాలుడు చిరుతపులి బారిన పడ్డారు. భయపడిన గ్రామస్తులు తమ ఇళ్ల చుట్టూ విద్యుత్ తీగలు, ఇనుప గ్రిల్‌లను ఏర్పాటు చేసుకున్నారు. పొలాల్లో పనిచేసేటప్పుడు వారు స్పైక్డ్ కాలర్‌లను కూడా ధరించి వెళ్తున్నారు.
Also Read:Udaipur Wedding: బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు.. వీడియో వైరల్
తరచుగా చిరుతపులులు కనిపించడం, ఇటీవల జరిగిన అనేక దాడులు రోజువారీ బహిరంగ కార్యకలాపాలను ప్రమాదకరంగా మార్చాయని గ్రామస్తులు అంటున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఓ రైతు మాట్లాడుతూ.. వ్యవసాయం మా ఏకైక ఆదాయ వనరు. చిరుతపులి దాడులకు భయపడి మేము ఇంట్లో ఉండాల్సి వస్తుందని తెలిపారు. మేము ప్రతిరోజూ చిరుతపులిని చూస్తాము. చిరుతలు ఎప్పుడైనా పొలాల్లోకి వస్తాయి. చిరుతల కారణంగా మేము ఈ కాలర్లను ధరిస్తాము. ఒక నెల క్రితం తన తల్లిని కూడా చిరుతపులి చంపిందని ఆ రైతు అన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని, ఈ విషయాన్ని పరిష్కరించడానికి వెంటనే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Also Read:President Draupadi Murmu: సత్యసాయి బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయి..
చిరుతపులి దాడులు రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేశాయని మరొక గ్రామస్తుడు చెప్పాడు. గ్రామస్తులు ఇప్పుడు భద్రత కోసం గుంపులుగా వెళ్లి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. నవంబర్ 5న, పూణే జిల్లాలోని పింపర్‌ఖేడ్ గ్రామం, పరిసర ప్రాంతాలలో గత 20 రోజుల్లో మూడు మరణాలకు కారణమైన నరమాంస భక్షక చిరుతపులిని అటవీ శాఖ, రెస్క్యూ బృందం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో చంపినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ తర్వాత, చిరుతపులి మృతదేహాన్ని గ్రామస్తులకు చూపించి, పోస్ట్‌మార్టం కోసం మానిక్‌డో చిరుతపులి రక్షణ కేంద్రానికి పంపారు. స్థానిక గ్రామస్తుల సహాయంతో సీనియర్ అటవీ అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.
#WATCH | Pune, Maharashtra | Amid a surge in leopard attacks across several villages in Pune, residents are taking unusual precautions to protect themselves. Local residents in Pimperkhed village, Shirur tahsil, Pune, are wearing collars and belts with sharp iron nails around… pic.twitter.com/8kCeuOcL6U
— ANI (@ANI) November 22, 2025