ఆ రైతులు పొలం పనులకు వెళ్లాలంటే గజగజ వణికిపోతున్నారు. కాలు బయటపెడితే మేకులు ఉన్న బెల్టులు మెడలో ధరించి వెళ్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మహారాష్ట్రలోని పూణేలో చిరుతలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. పింపర్‌ఖేడ్ గ్రామంలో, చిరుతపులి భయం చాలా తీవ్రంగా ఉంది. ప్రాణాంతక దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి నివాసితులు స్పైక్డ్ కాలర్‌లను ధరిస్తున్నారు. కేవలం ఒక నెలలోనే, 5 ఏళ్ల బాలిక, 82 ఏళ్ల వృద్ధురాలు, 13 ఏళ్ల బాలుడు…