ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన షాపుల వద్ద రైతులు పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు చేత పట్టుకొని విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుతున్న ఎండలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. కొద్ది షాపుల్లో స్టాక్ ఉండటంతో.. రైతులు భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడితే కేవలం ప్యాకెట్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 659 అనే రకం విత్తనాలే కావాలని రైతులు కోరుతున్నారు.
Read Also: PawanKalyan- Chandrababu: ఈనెల 31న పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీ.. ఎందుకంటే?
మరోవైపు.. పట్టణంలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో గల విత్తనాల షాపులను జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పరిశీలించారు. ఈ సందర్భంగా యజమానులతో విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయిందని తెలిపారు. దానివల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసుల బందోబస్తు ఏర్పా్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్దీకరణతో కూడిన వరుసక్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంతంగా రైతులు సంయమనం పాటిస్తూ వరుస క్రమాలలో విత్తనాలను షాపుల వద్ద నుండి తీసుకోవాలని, పోలీసులు తమ క్షేమం కోసమే విధులను నిర్వర్తిస్తుంటారనే విషయాన్ని గమనించాలని ఎస్పీ సూచించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే ఆకస్మిక తనిఖీలను నిర్వర్తిస్తున్నట్టు, ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు 500 కిలోల 19 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.
Read Also: Mamata Banerjee: ‘‘మోడీకి గుడి కట్టించి, ధోక్లా ప్రసాదంగా ఇస్తాం’’.. ప్రధానిపై మమత సెటైర్లు..